క్రొయేషియా మంత్రి మరో మహిళా మంత్రితో అనుచితంగా ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. నవంబర్ 2వ తేదీన బెర్లిన్‌లో జరిగిన ఐరోపా యూనియన్ మీటింగ్ సమావేశానికి ఈయూ దేశాల మంత్రులతోపాటు వివిధ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు.
క్రొయేషియా ఫారెన్ మినిస్టర్ గోర్డన్ గార్లిక్ ర్యాడ్‌మన్, జర్మన్ ఫారెన్ మినిస్టర్ అన్నాలెనా బెర్‌బాక్ కూడా పాల్గొన్నారు. అయితే గ్రూప్ ఫొటో దిగే సమయంలో క్రొయేషియా మంత్రి గోర్డాన్ రడ్మాన్, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
తర్వాత ఆమె వైపు వంగి, చెంపపై ముద్దు పెట్టారు. నేతలంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో సర్వత్రా గోర్డాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మీడియా సమక్షంలో క్షమాపణలు తెలిపారు.