Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుట్టినింట కరోనా విశ్వరూపం - చైనా రోడ్లపై శవాల గట్టలు

covid deaths in china
, మంగళవారం, 27 డిశెంబరు 2022 (09:53 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో కరోనా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 వ్యాప్తి విశృంఖలంగా ఉంది. ఫలితంగా కోట్లాది మంది చైనీయులు ఈ వైరస్ బారినపడుతున్నారు. నిత్యం లక్షల్లో కరోనా కేసులు నమోదవుతుండగా, వేలాది మంది చనిపోతారు. దీనికి కారణం చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా ప్రబలిపోవడమే. దీంతో కరోనా కారణంగా చనిపోయిన తమ ఆప్తులకు అంత్యక్రియలు చేసేందుకు సైతం చైనీయులు రోడ్లపై మృతదేహాలను వరుస క్రమంలో ఉంచి తమ వారి వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పాశ్చాత్య మీడియాలో వస్తున్నాయి. 
 
చైనాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఎఫ్ 7 మృత్యుఘంటికలు మోగిస్తుందని, అమెరికాకు చెందిన అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ వెల్లడించారు. చైనాలో కరోనా మృతుల శవాలతో ఆస్పత్రులు నిండిపోయాయని, అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద మృతదేహాలతో ప్రజలు బారులు తీరిన పరిస్థితులు నెలకొనివున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని వీడియోలను షేర్ చేశారు. 
 
అయితే, చైనా మాత్రం గత వారం రోజుల్లో కేవలం ఒక్కటంటే ఒక్క కరోనా మరణం సంభవించిందని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవ పరిస్థితులను ఏమాత్రం బహిర్గతం చేయడం లేదు. చైనాలో ఈ నెల 7వ తేదీ తర్వాత కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగిపోయి లక్షలాది మంది చైనీయులు ఈ వైరస్ బారినపడ్డారు. వచ్చే యేడాది డిసెంబరు ఆఖరు నాటికి చైనాలో కరోనా మరణాలు 20 లక్షలకు పైగా చేరుకుంటాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ.. వైకాపా నో ఎంట్రీ