Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లల్ని పట్టుకుంటున్న కరోనావైరస్: ఇండోనేషియాలో 6-11 ఏళ్ల వారికి టీకా

పిల్లల్ని పట్టుకుంటున్న కరోనావైరస్: ఇండోనేషియాలో 6-11 ఏళ్ల వారికి టీకా
, మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:23 IST)
ఇండోనేసియా మంగళవారం నుండి 6-11 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు కోవిడ్ 19 టీకాలు వేయడం ప్రారంభించిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. దీనికి కారణం ఇండోనేషియాలో 0-18 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో 4.2 మిలియన్ల మందికి పైగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు నమోదు కావడమే. దీనితో ఇండోనేషియా ప్రభుత్వం అప్రమత్తమైంది.

 
మొత్తం ఇన్ఫెక్షన్లలో 13% మంది పిల్లలే వుండటంతో ఆందోళన చెందిన ప్రభుత్వం వెంటనే 6 నుంచి 11 ఏళ్ల మధ్య వున్న పిల్లలకి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇదిలావుంటే చైనా ఇప్పటికే మూడు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించింది. కాంబోడియా సెప్టెంబరులో 6-12 సంవత్సరాల పిల్లలకు మొదటి టీకాలు వేసింది. సింగపూర్ గత వారం 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ సంవత్సరం చివరిలోపు టీకాలు వేయడం ప్రారంభిస్తామని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో ఫోన్ కాల్, పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే గోడకేసి కొట్టింది, అంతే....