జపాన్‌లో కరోనా తీవ్రత మరింత పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనాతో నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్‌లోని ఒసాకా నగరంలో 1500 మందిని కరోనా సోకింది. ప్రస్తుతం ఒసాగో మేయర్ ఇచ్చేరి మట్చుయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైనాయి. ప్రజలు అత్యావసర వస్తువులను కొనడంపై మేయర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైనాయి.
మహిళలు షాపింగ్‌కు వెళ్తే చాలా సమయం తీసుకుంటారని.. అదే పురుషులైతే షాపింగ్‌కు తక్కువ సమయాన్ని తీసుకుంటారని చెప్పారు. అందుకే సూపర్ మార్కెట్‌కు పురుషులే వెళ్లాలని.. మహిళలను షాపింగ్‌కు పంపవద్దని మేయర్ కామెంట్లు చేశారు. అయితే మేయర్ ఇలాంటి కామెంట్స్ చేయడం మహిళలకు రుచించలేదు. మేయర్ ఇలాంటి మాటలేంటని మండిపడుతున్నారు.