Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ రైలు ప్రయాణ దూరం 8 వేల మైళ్లు. పట్టే సమయం రెండున్నర వారాలు

మన దేశంలో అత్యంత సుదీర్ఘ రైలు ప్రయాణ దూరం ఎంతో తెలుసా.. మహా అంటే 3 వేల కిలోమీటర్ల లోపే ఉంటుంది. కానీ మానవ చరిత్రలో అతి సుదీర్ఘ రైలు ప్రయాణం సాగస్తున్న తొలి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. జనవరి తొలివారంలో చైనా ప్రారంభించిన ఒక సరుకు రవాణా రైలు మానవ ప

ఆ రైలు ప్రయాణ దూరం 8 వేల మైళ్లు. పట్టే సమయం రెండున్నర వారాలు
హైదరాబాద్ , బుధవారం, 11 జనవరి 2017 (07:07 IST)
మన దేశంలో అత్యంత సుదీర్ఘ రైలు ప్రయాణ దూరం ఎంతో తెలుసా.. మహా అంటే 3 వేల కిలోమీటర్ల లోపే ఉంటుంది. కానీ మానవ చరిత్రలో అతి సుదీర్ఘ రైలు ప్రయాణం సాగస్తున్న తొలి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది.
జనవరి తొలివారంలో చైనా ప్రారంభించిన ఒక సరుకు రవాణా రైలు మానవ ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలెట్టింది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ లోని ఇవు వెస్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరిన ఆ రైలు బ్రిటన్ రాజదాని లండన్‌ వైపు తన ప్రయాణం కొనసాగించిందని జిన్హువా పత్రిక ప్రకటించింది. 
 
ఇవు నుంచి లండన్‌కు చిన్న వస్తువులతో కూడిన ఈ రైలు ప్రయాణాన్ని చైనా రైల్వే ఎక్స్‌ప్రెస్ సంస్థ తలపెట్టింది. జనవరి 4న మొదలైన ఈ రైలు ప్రయాణం దాదాపు 8 వేల మైళ్ల దూరం ప్రయాణించి రెండున్నర వారాల్లో తన గమ్యాన్ని చేరుకుంటుంది. బ్రెక్సిట్ అనంతరం బ్రిటన్-చైనా మధ్య  నెలకొన్న కీలకమైన వాణిజ్య భాగస్వామ్యానికి ఈ సరకుల రవాణా రైలు నాంది పలకనుందని  బ్రిటన్ కేంద్రంగా పనిచేసే వన్‌టూత్రీ లాజిస్టిక్స్ కంపెనీ మేనేజర్ ఆస్కార్ లిన్ పేర్కొన్నారు ఈ రైలులోని సరకుల క్లియరెన్స్, పంపిణీని ఈ కంపెనీ నిర్వహిస్తోంగదని చైనా ప్రభుత్వ అధికార పత్రిక చైనా డైలీ తెలిపింది. 
 
గృహోపకరణాలు, బ్యాగులు, సూట్ కేసులు, ఆభరణాలు తదితర వస్తువులతో కూడిన ఈ రైలు కజికిస్తాన్, రష్యా, బెలారస్, పోలండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా ప్రయాణించి చివరకు లండన్ చేరుకుంటుంది. చైనా యూరప్ మధ్య సరకుల రవాణా సేవలను జరపర్చిన 15వ నగరంగా లండన్ కానుందని జిన్హువా పేర్కొంది. వన్ బెల్ట్ వన్ రోడ్ అనే పేరిట చైనా అధ్యక్షుడు గ్జి జింగ్‌పింగ్ నిర్దేశించిన దార్సనికతలో ఈ రైలు ఒక భాగం. దీన్నే కొత్త సిల్క్ రోడ్ అంటున్నారు. యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలతో చైనా ఆర్థిక బంధాలను మరింతగా మెరుగుపర్చే మౌలికవసతుల ప్రారంభచర్యల్లో ఈ రైలు ప్రయాణం భాగమై ఉండాలని జింగ్‌పింగ్ ఆశిస్తున్నారు. 
 
జనవరి 23 లేదా 24 తేదీల్లో లండన్ చేరుకునే ఈ సుదీర్ఘ రైలు ప్రయాణం ప్రపంచాధిపత్యశక్తిగా చైనాను నిలబెట్టే ప్రయాణమని అంతర్జాతీయ నిపుణుల వ్యాఖ్య. అంటే భారత్‌ను ఇది ఆందోళనపర్చే రైలు కూడా మరి.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేఖర్‌ రెడ్డికి రూ.8 కోట్ల కొత్త నోట్లిచ్చా.. ఇంకేం అడగొద్దు... : పరస్మాల్ లోధా