Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాతో ముప్పు పొంచి వుంది... వేగం పెంచాలి: భారత ఆర్మీ చీఫ్

చైనా సరిహద్దులపై కన్నేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఇప్పటివరకు పాకిస్థాన్ పైనే దృష్టిసారించామని... అయితే చైనా పొరుగు దేశాలను మచ్చిక చేసుకుని చైనా కుట్రలు పాల్పడుతో

చైనాతో ముప్పు పొంచి వుంది... వేగం పెంచాలి: భారత ఆర్మీ చీఫ్
, శనివారం, 13 జనవరి 2018 (14:49 IST)
చైనా సరిహద్దులపై కన్నేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఇప్పటివరకు పాకిస్థాన్ పైనే దృష్టిసారించామని... అయితే చైనా పొరుగు దేశాలను మచ్చిక చేసుకుని చైనా కుట్రలు పాల్పడుతోందని బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో డూకుడు పెంచుతూ, భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు చైనా ప్రయత్నాలు సాగిస్తోందని విమర్శలు చేశారు. 
 
నేపాల్, మయన్మార్, బూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సంప్రదింపులను కొనసాగిస్తూ, చైనాతో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి పెట్టాలని, భారత్‌కు దూరంగా ఈ దేశాలు వెళ్లకుండా చూసుకోవాలని బిపిన్ రావత్ చెప్పారు.
 
కాబట్టి చైనా సరిహద్దులపై దృష్టి సారించాలని, ఉత్తర ప్రాంతంలో మిలిటరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచాలని రావత్ చెప్పుకొచ్చారు. చైనా మిలిటరీ నుంచి ఏ క్షణంలోనైనా ముప్పు పొంచి వుందని తెలిపారు. అయితే చైనా ఎలాంటి చర్యలకు దిగినా సమర్థవంతంగా తిప్పికొట్టే సత్తా భారత సైన్యానికి వుందని బిపిన్ చెప్పుకొచ్చారు. 
 
ఉత్తర డోక్లాంలో చైనా తన సైన్యాన్ని మోహరిస్తోందని, శీతాకాలం ముగిసిన వెంటనే, సరిహద్దుల్లోని కేంద్రాల్లో కూడా చైనా బలగాలు మోహరించే అవకాశం ఉందని బిపిన్ రావత్ పేర్కొన్నారు. వాటికి అనుగుణంగానే భారత బలగాలను మోహరిస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పెళ్లి: ఐఎస్‌కు భార్యను అమ్మాలనుకున్నాడు.. అలా వీడియో తీసి..?