Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా జీడీపీ డౌన్

Advertiesment
చైనా జీడీపీ డౌన్
, శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:42 IST)
చైనా వృద్ధిరేటు దారుణంగా డౌనైపోయింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.

ఫలితంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.8 శాతం క్షీణించింది. 1976 తర్వాత ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. అప్పట్లో వచ్చిన సాంస్కృతిక విప్లవం తర్వాత వృద్ధి రేటు భారీగా క్షీణించింది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో పడిపోయింది.
 
చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చైనా జీడీపీ 20.65 ట్రిలియన్ యువాన్లు అంటే.. దాదాపు 2.91 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 6.8 శాతం తక్కువ.

ఊరట నిచ్చే విషయం ఏంటంటే.. మొదటి రెండు నెలల్లో 20.5 శాతం తగ్గిన వృద్ధిరేటు మార్చిలో పుంజుకోవడం. 2018లో 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న చైనా జీడీపీ 2019లో 14.38 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.

అయితే, కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చతికిలపడడంతో వృద్ధిరేటు ఈసారి భారీగా క్షీణించింది.మొదటి రెండు నెలలతో పోలిస్తే మార్చిలో పెరిగిన వృద్ధి చైనా వృద్ధిరేటు దారుణంగా పడిపోయింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది.

ఫలితంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.8 శాతం క్షీణించింది. 1976 తర్వాత ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. అప్పట్లో వచ్చిన సాంస్కృతిక విప్లవం తర్వాత వృద్ధి రేటు భారీగా క్షీణించింది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో పడిపోయింది.
 
చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చైనా జీడీపీ 20.65 ట్రిలియన్ యువాన్లు అంటే.. దాదాపు 2.91 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 6.8 శాతం తక్కువ.

ఊరట నిచ్చే విషయం ఏంటంటే.. మొదటి రెండు నెలల్లో 20.5 శాతం తగ్గిన వృద్ధిరేటు మార్చిలో పుంజుకోవడం. 2018లో 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న చైనా జీడీపీ 2019లో 14.38 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అయితే, కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చతికిలపడడంతో వృద్ధిరేటు ఈసారి భారీగా క్షీణించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో ప్రేమ జంట ఆత్మహత్య