సంప్రదాయ ధోరణులు కాలరాసినందుకు ఫార్చ్యూన్-40 లిస్టులో ఎన్.ఐర్.ఐలకు చోటు
ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తయారు చేసిన జాబితాలో ఐదుగురు ప్రవాస భారతీయులు చోటుదక్కించుకున్నారు. వివిధ రంగాల్లో సంప్రదాయ ధోరణులను కాలరాసి, సరికొత్త విధానాలను ఆవిష్కరిస్తూ, ఇతరులను ప్రభావితం చేస్తున్న
ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తయారు చేసిన జాబితాలో ఐదుగురు ప్రవాస భారతీయులు చోటుదక్కించుకున్నారు. వివిధ రంగాల్లో సంప్రదాయ ధోరణులను కాలరాసి, సరికొత్త విధానాలను ఆవిష్కరిస్తూ, ఇతరులను ప్రభావితం చేస్తున్న 40 ఏళ్ల లోపు యువతలో 40 మందిని ఎంచుకుంటూ ఈ జాబితాను తయారు చేశారు. ఇందులో ఐదుగురు ప్రవాస భారతీయులకు చోటుదక్కింది.
వీరిలో మూలకణ పరిశోధనలకు సంబంధించి స్టార్టప్ నెలకొల్పిన దివ్యా నాగ్ 27వ స్థానం దక్కించుకోగా, ఆరోగ్య సంరక్షణ సేవల సాంకేతిక సంస్థ అవుట్‌కమ్ హెల్త్ పర్యవేక్షకులుగా ఉన్న రిశిషా, శ్రద్ధా అగర్వాల్‌లకు 38వ స్థానం, స్వచ్ఛంద సంస్థ శామాసోర్స్ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి లీలా జానాకు 40వ స్థానం, అలాగే ఐర్లాండ్ నూతన ప్రధానిగా ఎన్నికైన ప్రవాస భారతీయుడు వరద్‌కర్‌కు 5వ స్థానాలు దక్కాయి. ఈ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు అగ్రస్థానం దక్కించుకోవడం గమనార్హం.