Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్ చైల్డ్ జీనియస్... ఐక్యూలో ఐన్‌స్టీన్ కంటే ఎక్కువ... ఎలా?

ఓ భారతీయ సంతతి బుడతడు ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. అదీకూడా చైల్డ్ జీనియస్‌ పోటీల్లో అడిగిన ప్రతి ప్రశ్నకు ఠక్కుఠక్కున సమాధానమిచ్చి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
Child Genius
, గురువారం, 17 ఆగస్టు 2017 (13:32 IST)
ఓ భారతీయ సంతతి బుడతడు ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. అదీకూడా చైల్డ్ జీనియస్‌ పోటీల్లో అడిగిన ప్రతి ప్రశ్నకు ఠక్కుఠక్కున సమాధానమిచ్చి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రిటన్ టీవీ చానెల్ 4లో చైల్డ్ జీనియస్ అనే కార్యక్రమం ప్రసారమవుతోంది. ఇందులో 12 ఏళ్ల భారత సంతతి బాలుడు పాల్గొన్నాడు. ఆ బాలుడి పేరు రాహుల్. ‘చైల్డ్‌ జీనియస్‌’ కార్యక్రమంలో తొలిరౌండ్‌లో భార‌త సంత‌తి బాలుడు రాహుల్‌ 14 ప్రశ్నలకు సరైన‌ సమాధానమిచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. రాహుల్ ఐక్యూ పాయింట్ల విలువ 162. ఇది ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌లు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే ఎక్కువ‌. 
 
వారంపాటు జ‌ర‌గనున్న‌ ఈ పోటీలో 8–12 ఏళ్ల వ‌య‌సున్న‌ 20 మంది బాలలు పాల్గొంటున్నారు. వీరిలో ఒకరిని మాత్రం విజేతగా ప్రకటిస్తారు. తొలిరౌండ్‌లో జ‌రిగిన స్పెల్లింగ్‌ టెస్ట్‌లో రాహుల్‌ పూర్తి మార్కులు పొందగా, జ్ఞాపక శక్తి పరీక్షలో 15 ప్రశ్నల్లో 14 ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పాడు. ముఖ్యంగా, ఐన్‌స్టీన్‌ని మించిన జ్ఞానంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన‌ భార‌త సంత‌తి బాలుడు... ఒక్క‌రాత్రిలో బ్రిట‌న్ టీవీ సెల‌బ్రిటీగా మారిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఒక్క రాష్ట్రానికి వోడాఫోన్ బంపర్ ఆఫర్...