Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నచేప చాణక్య ఏమంటుందంటే..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారట..

అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సర్వేలు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్తుంటే.. కొన్ని సర్వేలు మాత్రమే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు

చిన్నచేప చాణక్య ఏమంటుందంటే..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారట..
, మంగళవారం, 8 నవంబరు 2016 (15:58 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సర్వేలు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్తుంటే.. కొన్ని సర్వేలు మాత్రమే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తొలి ఫలితం వెలున్యూ హ్యాంప్‌షైర్‌లోని డిగ్జ్‌విల్లే నాచ్‌లో పోలింగ్‌ పూర్తయి ఫలితం వచ్చింది. ఇక్కడి ఎనిమిది ఓట్లలో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ నాలుగు ఓట్లు గెలుచుకోగా, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు ఓట్లు మాత్రమే సొంతం చేసుకున్నారు. కానీ చాణక్య మాత్రం ట్రంపే గెలుస్తుందని చెప్తోంది. ఇంతకీ చాణక్య ఎవరంటే.. చిన్న చేప. 
 
చేపల ప్రేమికుడు ఆర్ వరుణ్ దీనిని ఇష్టంగా పెంచుకుంటున్నారు. గతంలో ఇది చెప్పిన జోస్యాలన్నీ చాలా వరకు నిజమయ్యాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పెట్టిన పరీక్షలో చాణక్య ట్రంప్ వైపు మొగ్గుచూపింది. ఓ నీటి తొట్టెలో హిల్లరీ, ట్రంప్ ఫొటోలను పెట్టారు. అంతే చాణక్య వేగంగా ఈదుకుంటూ వెళ్లి ట్రంప్ ఫొటోను పట్టుకుంది. దీంతో ట్రంప్ గెలుపు ఖామని తేలిపోయిందన వరుణ్ అంటున్నారు. 
 
గతంలో యూరోకప్‌లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ గెలుస్తుందని చెప్పింది. అది నిజమైంది. 2015లో వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లోనూ అది చెప్పిన జోస్యం నిజమైంది. దీంతో ఇప్పుడు ట్రంప్ గెలుపు కూడా తథ్యమని అంటున్నారు. మరి ఏమౌతుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతివేగంతో కారు ఢీ.. గాల్లోకి ఎగిరి.. రెప్పపాటులో తల్లి మృతి.. కుమార్తెకు గాయాలు..