Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జర్మన్‌లో రెండు ముక్కలైన కార్గో విమానం

cargo plane
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (11:38 IST)
జర్మన్ దేశంలో ఓ కార్గో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఈ విమానం రెండు ముక్కలైంది. జర్మన్‌కు చెందిన డీహెచ్ఎల్ బోయింగ్ 757 కార్గో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానం రన్‌వేపై రెండు ముక్కలైంది. 
 
ఈ విమానం కోస్టారికాలోని సాన్ జోస్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ఎయిర్ పోర్టు అనుమతి కోరిన పైలెట్లు విమానాన్ని ఎయిర్‌పోర్టుకు తరలించారు. అయితే, ఆ విమానం రన్‌ వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత  రెండు ముక్కలైంది. 
 
అయితే, ఈ విమానంలో నుంచి పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైనట్టు సమాచారం. ల్యాండిగ్ సమయంలో విమాన ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన ఎయిర్‌పోర్టు అధికారులు అందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సిద్ధంగా ఉన్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు