Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

Advertiesment
chrystia freeland

ఠాగూర్

, మంగళవారం, 17 డిశెంబరు 2024 (11:15 IST)
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థిక శాఖామంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవులకు రాజీనామా చేశారు. కెనడా దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో మంత్రివర్గంలో అత్యంత శక్తిమంతురాలిగా పేరొందిన క్రిస్టియా రాజీనామా చేయడం ఇపుడు కెనడా దేశంలోనే కాకుండా, ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పైగా, ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా ప్రకటించి, తన రాజీనామాకు కూడా ఇదే కారణమంటూ ఆమె పేర్కొన్నారు. కనా, ట్రూడో సన్నిహితులు మరోలా స్పందిస్తున్నారు. ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో క్రిస్టియా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు. 
 
ప్రస్తుతం కెనడా ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. మరో వైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్నారని, అటువంటి ముప్పును మనం తీవ్రంగా పరిగణించాలని రాజీనామా లేఖలో క్రిస్టియా ఫ్రీలాండ్ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా ఉత్తమ మార్గాల కోసం అన్వేషించామని, ఈ క్రమంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయాయని ఆమె పేర్కొన్నారు. అయితే తాను లిబరల్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో టొరంటో నుంచి మళ్లీ పోటీ చేస్తానని క్రిస్టియా వెల్లడించారు.
 
కాగా, క్రిస్టియా 2013లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అనంతరం అధికారం చేపట్టిన ట్రూడో మంత్రివర్గంలో చేరారు. వాణిజ్య, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2020 ఆగస్టు నుంచి ఆర్థిక మంత్రిగా ఆమె కొనసాగుతున్నారు. అయితే, దేశ ఆర్థిక సవాళ్లకు సంబంధించిన విషయాలను పార్లమెంట్‌కు నివేదించనున్న కొన్ని గంటల్లోనే క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?