Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూమ్‌లో నగ్నంగా కనిపించిన కెనడా ఎంపీ.. బట్టలు మార్చుకుంటూ దొరికిపోయాడు..!

Advertiesment
జూమ్‌లో నగ్నంగా కనిపించిన కెనడా ఎంపీ.. బట్టలు మార్చుకుంటూ దొరికిపోయాడు..!
, శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (13:19 IST)
జూమ్ కాల్స్‌లోనే ప్రస్తుతం అన్నీ జరుగుతున్నాయి. కరోనా వల్లనే ఓ దేశంలో ఏకంగా పార్లమెంట్ సమావేశాల్ని కూడా జూమ్ కాల్‌లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేవాలు జూమ్ కాల్‌లో జరుగుతున్న సమయంలో ఓ ఎంపీ జూమ్‌లో నగ్నంగా కనిపించాడు. దీంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన కెనడాలో జరిగింది. పొరపాటుగా జరిగినా.. ఫన్నీగా జరిగినా గానీ పాపం సదరు ఎంపీ దొరికిపోయాడు. ఆ తరువాత క్షమాపణలు చెప్పుకున్నాడు.
 
ప్రపంచ దేశాలతో పాటు కరోనా కెనడాను కూడా హడలెత్తిస్తోంది. దీంతో పార్లమెంట్ సమావేశాల్ని జూమ్ కాల్‌లో జరిగిలే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో విలియమ్ ఆమోస్‌ అనే ఎంపీ నగ్నంగా కనిపించటంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా షాక్ అయ్యారు. విలియమ్ ఆమోస్‌ది క్యూబెక్ జిల్లాలోని పాంటియాక్ నియోజకవర్గం. 
 
లిబరల్ పార్టీకి చెందిన ఆ ఎంపీ మిలియమ్ ఆమోస్. ఈ క్రమంలో విలియమ్ ఉదయాన్నే లేచి జాగింగ్‌కు వెళ్లి వచ్చాడు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన సమయం దగ్గరపడిందని స్నానం చేయకుండానే సమావేశాల్లో పాల్గొందామనుకున్నారు. తన ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేసి ఇంకా కొంచెం టైమ్ ఉంది కదాని ఈ టైమ్‌లో బట్టలు మార్చేసుకుందామని అనుకున్నారు.
 
అలా బట్టలు మార్చుకునే సమయంలోనే జూమ్ వీడియో సడెన్‌గా ఆన్ అయ్యింది. దాంతో అతను సమావేశాల్లో నగ్నంగా కనిపించాడు. ఈ ఘటన పొరపాటున జరిగిందని తనను క్షమించాలను కోరుకున్నాడు. దాంతో తాను నగ్నంగా కనిపించాల్సి వచ్చిందన్నారు. ఎంపీ ఆమోస్ నగ్నంగా ఉన్న ఓ స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఆ ఘటన తనను ఇబ్బందికి గురి చేసిందన్నారు. నిజాయితీగా తప్పును ఒప్పుకుంటున్నానని..మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు. దయచేసి నా పొరపాటుకు హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యులంతా క్షమించాలని ట్విట్టర్‌ వేదికగా కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్యులకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి..