Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తెతో వ్యభిచారం చేయిస్తూ.. నగ్న చిత్రాలను విక్రయంచిన తల్లి

ఓ మాతృమూర్తికి కళంకం తీసుకువచ్చేలా ఓ తల్లి ప్రవర్తించింది. తన ఇద్దరు పిల్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. ఆ బిడ్డలను లైంగికంగా వేధించింది. అంతేనా బలవంతంగా వ్యభిచారం చేయించడమే కాకుండా, ఇద్దరు కన్

Advertiesment
కుమార్తెతో వ్యభిచారం చేయిస్తూ.. నగ్న చిత్రాలను విక్రయంచిన తల్లి
, గురువారం, 11 ఆగస్టు 2016 (10:12 IST)
ఓ మాతృమూర్తికి కళంకం తీసుకువచ్చేలా ఓ తల్లి ప్రవర్తించింది. తన ఇద్దరు పిల్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. ఆ బిడ్డలను లైంగికంగా వేధించింది. అంతేనా బలవంతంగా వ్యభిచారం చేయించడమే కాకుండా, ఇద్దరు కన్నబిడ్డలను నగ్నంగా ఫోటోలు తీసి విక్రయించింది. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ చర్యలు.. కెనడా దేశంలో జరిగాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కెనడా దేశంలోని ఒట్టావా నగరానికి చెందిన 33 ఏళ్ల సులభంగా డబ్బు సంపాదించాలని భావించింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా తన నాలుగేళ్ల చిన్నారితోపాటు మరో పెద్ద కుమార్తెను లైంగికంగా వేధించింది. పెద్ద కుమార్తెతో బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఆ తర్వాత వారిద్దరిని నగ్నంగా ఫోటోలు తీసి వాటిని ఇతరులకు విక్రయించింది. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో వారిద్దరు పోలీసులను ఆశ్రయించారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి చేతిలో లైంగిక వేధింపులకు గురైన కూతుళ్ల వయసు 4, 18 సంవత్సరాలని, డబ్బు కోసం కూతుళ్ల లైంగిక చిత్రాలను సదరు మహిళ విక్రయించిందని కెనడా పోలీసులు పేర్కొన్నారు. పోలీసులకు ఆరుగురు అమ్మాయిల నగ్న చిత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్యానాలో అక్కాచెల్లెళ్ల గ్యాంగ్ రేప్