హర్యానాలో అక్కాచెల్లెళ్ల గ్యాంగ్ రేప్
నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా అలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా అలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... సోనిపట్ ప్రాంతానికి చెందిన ఇద్దరు దళిత మైనర్ బాలికలను కొందరు కామాంధులు బలవంతంగా లాక్కెళ్లి వారిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. పదిహేనేళ్ల వయసున్న ఆ ఇద్దరు బాలికలు స్వయానా అక్కాచెల్లెల్లు.
పాఠశాల నుండి ఇంటికి తిరిగొస్తుండగా వారికి దూరపు బంధువు అయిన అజయ్ అనే కామాంధుడు తన ఇద్దరు స్నేహితులతో వారిని అడ్డగించాడు. వారిని బలవంతంగా సమీపంలో నున్న పొలాల్లోకి లాక్కెళ్లి ఆ ఇద్దరిలో ఒకరైన చెల్లెలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కను కూడా లైంగికంగా వేధించారు. అక్కాచెల్లెల్ల అరుపులు కేకలు విన్న గ్రామస్థులు వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితులపై 376 (అత్యాచారం) సెక్షనుతో పాటు ఎస్.సి., ఎస్.టి., చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.