Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంగా అవతరించిన పాలస్తీనా... దేశంగా గుర్తించిన అగ్రదేశాలు

Advertiesment
Britain, Canada and Australia

ఠాగూర్

, సోమవారం, 22 సెప్టెంబరు 2025 (13:32 IST)
పాలస్తీనా ఒక దేశంగా అవతరించింది. ఈ దేశాన్ని బ్రిటన్‌తో సహా పలు అగ్రదేశాలు గుర్తించాయి. పాలస్తీనాను దేశంగా గుర్తించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల్లో శాంతిస్థాపన ఆశలు పునరుద్ధరించేందుకు రెండు దేశాల విధానం సరైనదని స్టార్మర్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా కూడా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. అతి త్వరలో ఫ్రాన్స్ పోర్చుగల్ కూడా పాలస్తీనాను దేశంగా అధికారికంగా గుర్తించనున్నాయి. 
 
పాలస్తీనాను దేశంగా గుర్తించడమంటే 2023 అక్టోబరు 7నాటి దాడిపై హమాస్‌కు బహుమతి ఇచ్చినట్లేనని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల వేళ పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ ఆయా దేశాలు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఐక్యరాజ్య సమితిలోని 145 దేశాలు పాలస్తీనాను ఇప్పటికే దేశంగా గుర్తించాయి. అయితే, భద్రతా మండలిలో ఆమోదం పొందితేనే పాలస్తీనాను ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశంగా గుర్తిస్తారు. అమెరికా వీటో చేస్తుండటంతో పాలస్తీనాకు మోక్షం లభించడం లేదు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nara Lokesh: కానిస్టేబుల్ వెంకటరత్నంను కొనియాడిన మంత్రి నారా లోకేష్ (video)