Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో ఘోరం.. నల్లజాతీయుడిని పొట్టనబెట్టుకున్న పోలీసులు

Advertiesment
అమెరికాలో ఘోరం.. నల్లజాతీయుడిని పొట్టనబెట్టుకున్న పోలీసులు
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:29 IST)
అమెరికాలో ఘోరం జరిగిపోయింది. అమెరికా పోలీసులు నల్లజాతీయులను దారుణంగా హింసిస్తున్నారు. ఓ నల్లజాతీయుడి పోలీసులు పొట్టన బెట్టుకున్న ఉదంతం తాజాగా కలకలకం రేపింది. అతని ముఖానికి పోలీసులు కవర్ చుట్టి ఊపిరాడకుండా చంపేసిన వీడియో బయటపడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వీడియోపై అమెరికాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
 
 
నడిరోడ్డుపై పోలీసులందరూ కలిసి నల్లజాతీయుడికి బేడీలు వేసి, ముసుగు కప్పి చంపడం ఇటీవలి చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 23న న్యూయార్క్ లో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. డేనియల్ ప్రూడ్ (41) అనే వ్యక్తి తన సోదరుడి ఆరోగ్యం బాగోలేదని మెడికల్ ఎమర్జెన్సీకి ఫోన్ చేసి బయటికి వచ్చారు. అయితే రాత్రిపూట గెరిల్లా ఆందోళనలు చేయడానికి అతనితో పాటు మరికొందరు బయటికి వచ్చినట్టు పోలీసులు భావించారు. అతని చొక్కాను విప్పించి బేడీలు వేసి రోడ్డుపై కూర్చోబెట్టారు. 
 
తనకు కరోనా ఉందని అతడు అరుస్తున్న పట్టించుకోకుండా దాడి చేశారు. అతడు వారిపై ఉమ్మేశాడు. దీంతో పోలీసులు అతని ముఖానికి కవర్ తొడిగారు. దీంతో అతడు ఊపిరాడక అపస్మారకంలోకి వెళ్లాడు. ఆస్పత్రికి తరలించగా వారం రోజుల తర్వాత అక్కడే మృతి చెందాడు. ఇది హత్యేనని వైద్యులు నిర్ధారించారు. ప్రూడ్‌ను హత్య చేసిన పోలీసులను వెంటనే కోర్టు ముందు నిలబెట్టి శిక్షించాలని పోలీసు కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్థిర మార్కెట్ల మధ్య స్వల్పంగా ముగిసిన బెంచిమార్కు సూచీలు, 95 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్