Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'హెచ్‌1-బి' నిబంధనలను కఠినతరం చేయాల్సిందే : అమెరికా

అమెరికాలో హెచ్1బి వీసా బిల్లు మళ్లీ చర్చకు వచ్చింది. హెచ్‌1-బి వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు అమెరికా చట్టసభ(కాంగ్రెస్‌)లోకి మరోసారి ప్రవేశించింది. 'అమెరికా ఉద్యోగాల రక్షణ, పెంపుద

'హెచ్‌1-బి' నిబంధనలను కఠినతరం చేయాల్సిందే : అమెరికా
, శుక్రవారం, 6 జనవరి 2017 (06:59 IST)
అమెరికాలో హెచ్1బి వీసా బిల్లు మళ్లీ చర్చకు వచ్చింది. హెచ్‌1-బి వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు అమెరికా చట్టసభ(కాంగ్రెస్‌)లోకి మరోసారి ప్రవేశించింది. 'అమెరికా ఉద్యోగాల రక్షణ, పెంపుదల' పేరుతో కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లికన్‌ నేతలు డారెల్‌ ఇసా, స్కాట్‌ పీటర్స్‌ ఈ బిల్లును కాంగ్రెస్‌లో బుధవారం ప్రవేశపెట్టారు. 
 
హెచ్‌1-బి వీసా దుర్వినియోగానికి తాజా బిల్లు అడ్డుకట్ట వేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వేతనాలకే విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడం ద్వారా అమెరికన్లకు ఉపాధిని దూరం చేస్తున్న సంస్థలపై చర్యలకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. 
 
అదేసమయంలో హెచ్‌1-బి వీసాకు కనీస వేతనాన్ని రూ.67 లక్షలకు(ఏడాదికి) పెంచడం, మాస్టర్స్‌ డిగ్రీ విషయంలో ఇస్తున్న మినహాయింపులను తొలగించడం వంటి మార్పులకు ఈబిల్లు ఉపకరించనుంది. నాణ్యతలేని మాస్టర్స్‌ డిగ్రీ పత్రాలతో అభ్యర్థులు వీసా పొందుతున్నారని ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్ని క్షిపణితో చైనాకు ముచ్చెమటలు.. పరిమితుల్ని ఉల్లంఘించిందంటూ గగ్గోలు