అమెరికన్ల ఉద్యోగాలు ఇకపై విదేశాలకు నో.. హెచ్1బీ వీసాలపై మరో బిల్లు
అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలకు తరలించే కంపెనీలకు ఇకపై బ్రేక్ వేసే దిశగా కొత్త బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. హెచ్1బీ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తూ విదేశాలకు తరలిపోయే ఉద్యోగాలను
అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలకు తరలించే కంపెనీలకు ఇకపై బ్రేక్ వేసే దిశగా కొత్త బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. హెచ్1బీ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తూ విదేశాలకు తరలిపోయే ఉద్యోగాలను ఈ బిల్లు ద్వారా కళ్లెం వేయవచ్చు. డెమొక్రాట్ సభ్యుడు డెరెక్ కిల్మర్, రిపబ్లికన్ సభ్యుడు డగ్ కొలిన్స్ ‘ద కీపింగ్ అమెరికన్ జాబ్స్ యాక్ట్’ పేరిట ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
అమెరికాలోని చాలా సంస్థలు అమెరికన్లకు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో తక్కువ జీతాలకు పనిచేసే ఆసియన్లను ఉద్యోగాల్లో నియమించుకోవడం ద్వారా ఈ వీసాను దుర్వినియోగం చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరోధించేందుకు గతంలో నాలుగు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసాలపై ఇటీవలే పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ ప్రసారం చేసిన 60 నిమిషాల కార్యక్రమంలో నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.