Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామంలోకి భల్లూకం.. హెలికాఫ్టర్‌ కింద కట్టి పార్కుకు.. గాలికి తట్టుకోలేక భయపడి?

ఆ భల్లూకానికి ఐదేళ్లు. ఓ గ్రామంలోకి ప్రవేశించింది. 90 కేజీల బరువున్న ఆడ ఎలుగుబంటిని రక్షించేందుకు అధికారులు పక్కా ప్లాన్ చేశారు. దానిని నేషనల్ పార్కులో వదిలేసేందుకు హెలికాప్టర్ మార్గాన్ని ఎంచుకున్నారు

Advertiesment
Bear
, శుక్రవారం, 3 మార్చి 2017 (15:17 IST)
ఆ భల్లూకానికి ఐదేళ్లు. ఓ గ్రామంలోకి ప్రవేశించింది. 90 కేజీల బరువున్న ఆడ ఎలుగుబంటిని రక్షించేందుకు అధికారులు పక్కా ప్లాన్ చేశారు. దానిని నేషనల్ పార్కులో వదిలేసేందుకు హెలికాప్టర్ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ ఆ మార్గమే భల్లూకాన్ని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. గ్రామంలోకి ప్రవేశించి భల్లూకాన్ని వలలో హెలికాప్టర్ కింద కట్టి తరలించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. అయితే మార్గమధ్యంలోనే ఆ ఎలుగుంటి మరణించింది. 
 
ఎలుగుబంటి మరణానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని జంతు ప్రేమికులు అంటున్నారు. భల్లూకాన్ని హెలికాఫ్టర్ ద్వారా తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని, రోడ్డు మార్గాన బోనుతో కూడిన వాహనంతో తరలించవచ్చు కదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కానీ థాయ్‌లాండ్‌లో నేషనల్ పార్క్‌కు తీసుకువెళ్లే ముందు దానికి మత్తు మందు ఇచ్చారని, మార్గమధ్యలో తెలివి రావడంతో భయపడిపోయిందని అధికారులు అంటున్నారు. 
 
మరో వర్గం తీవ్రంగా వీచిన గాలి కారణంగా ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చునని చెప్తున్నారు. అయితే దీనిపై ఓ స్వచ్ఛంధ సంస్థ కేసు వేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా దర్యాప్తుకు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దారికొస్తున్న ట్రంప్... 104 ఉపగ్రహాలు, 130 కోట్ల భారతీయులు...