దారికొస్తున్న ట్రంప్... 104 ఉపగ్రహాలు, 130 కోట్ల భారతీయులు...
దూకుడుగా మాట్లాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వరంలో మెల్లగా కరకుదనం తగ్గుతోందా..? ప్రపంచవ్యాప్తంగా ఆయన పట్ల వస్తున్న వ్యతిరేకత కారణంగా తన పద్ధతిని మార్చుకుంటున్నారా... కుమార్తె ఇవాంకా ట్రంప్ కు ఇస్తున్న సలహాలు ఏమిటి? ఇండియా పట్ల డోనాల్డ్ ట్ర
దూకుడుగా మాట్లాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వరంలో మెల్లగా కరకుదనం తగ్గుతోందా..? ప్రపంచవ్యాప్తంగా ఆయన పట్ల వస్తున్న వ్యతిరేకత కారణంగా తన పద్ధతిని మార్చుకుంటున్నారా... కుమార్తె ఇవాంకా ట్రంప్ కు ఇస్తున్న సలహాలు ఏమిటి? ఇండియా పట్ల డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిలో మార్పు రాబోతోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశం పట్ల అనుకూలంగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 130 కోట్ల భారతీయులు కలిగిన ఇండియా సైనిక శక్తి అపారం, యుద్ధ తంత్రం తక్కువేం కాదు. ఇటీవలే 104 ఉపగ్రహాలను ఒక్కసారిగా రోదశిలో ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది ఇండియా. దీనితో అమెరికా నిఘా సంస్థలు సైతం నివ్వెరపోయాయట. భారతదేశం శక్తి పెరుగుతోందని వారు ట్రంప్ వద్ద కొన్ని వివరాలతో సూచించారట.
మరి దీని ఫలితమో, లేక భవిష్యత్ వ్యూహమో తెలియదు కానీ భారతదేశంతో కలిసి పనిచేసేందుకు ట్రంప్ ఆసక్తిగా వున్నారంటూ వైట్ హౌస్ సిబ్బంది సంకేతాలు పంపుతోంది. పైగా ఐటీ ఇండస్ట్రీలో అమెరికా దేశం ఇండియాకు ఉద్యోగాలివ్వడం కాదు... ఇండియానే అమెరికా దేశస్తులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలంటూ కొత్త ఫార్మూలా ప్రధాని మోదీ ముందుకు తీసుకురాబోతున్నారట. ఇరు దేశాల సంబంధాలపై త్వరలో మోదీ-ట్రంప్ సమావేశమవుతారని కూడా తెలుస్తోంది. ట్రంప్ స్నేహపూర్వకంగా ఇలా ప్రపంచదేశాలతో వుంటే అంతకంటే కావాల్సిందేముంది?