Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఏమాత్రం నమ్మదగిన వ్యక్తికాదు : బరాక్ ఒబామా

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న ఒబామా ఇపుడు ఇలా వ్యాఖ్యానించడం ప్రపంచ దేశాధినేతల మధ్య చ

Advertiesment
Barack Obama
, ఆదివారం, 8 జనవరి 2017 (15:06 IST)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న ఒబామా ఇపుడు ఇలా వ్యాఖ్యానించడం ప్రపంచ దేశాధినేతల మధ్య చర్చగా మారింది. 
 
ముఖ్యంగా.. పుతిన్ ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ చేపట్టే చర్యలపై తమకు ఎప్పుడూ నమ్మకం లేదని... కానీ, అమెరికన్లు ఆయనకు మద్దతు ఇస్తుండటం, తనకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. 
 
ఆ అమెరికన్లు మరెవరో కాదని... రిపబ్లికన్లు అని చెప్పారు. ఇతర దేశాల అధినేతలపై ఆధారపడటం అమెరికా భవిష్యత్తుకు మంచిది కాదని సూచించారు. డెమొక్రాటిక్ పార్టీ నేతల కంటే పుతిన్ నే ట్రంప్ ఎక్కువగా విశ్వసిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా పుతిన్ ప్రచారం చేయించారని మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వోడాఫోన్ బంపర్ ఆఫర్.. రూ.7కే అపరిమిత కాల్స్ - రూ.16 అల్‌లిమిటెడ్ డేటా