Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాకు సహనం కత్తులు ఉన్నాయ్, మోడీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీతో తలపడాలి : బెలూన్లతో బెదిరింపులు

ఓర్పు - సహనం వదిలేస్తే ఏమవుతుందో రుచి చూపిస్తూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన మెరుపుదాడిలో సుమారు 40 నుంచి 70 మంది ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారత వీర సైని

మాకు సహనం కత్తులు ఉన్నాయ్, మోడీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీతో తలపడాలి : బెలూన్లతో బెదిరింపులు
, సోమవారం, 3 అక్టోబరు 2016 (12:19 IST)
ఓర్పు - సహనం వదిలేస్తే ఏమవుతుందో రుచి చూపిస్తూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన మెరుపుదాడిలో సుమారు 40 నుంచి 70 మంది ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారత వీర సైనికులు సరిహద్దులు దాటి, తమ భూభాగానికి వచ్చి ఉగ్రమూకలను నాశనం చేసి వెళతారని ఊహించలేక పోయిన పాక్, జరిగిన నష్టానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనలో నిమగ్నమై ఉంది. 
 
ప్రస్తుతానికి పగ తీర్చుకునే మార్గం కనిపించక, సరిహద్దులకు ఆవలివైపు నుంచి బెలూన్లకు బెదిరింపు లేఖలు కట్టి వదులుతోంది. పంజాబ్‌లోని దీనానగర్‌లో గాలిలో ఎగురుకుంటూ వచ్చిన రెండు బెలూన్లు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. 'మా దగ్గర సహనం కత్తులు ఉన్నాయ్, మోడీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీ సత్తా ఎంటో నేరుగా తలపడి చూసుకోవాలి' అంటూ పలు రకాల హెచ్చరికలను కాగితాలపై రాసి వాటిని బెలూన్లకు స్టిక్కర్లతో అంటించి విడిచి పెట్టినట్టు గుర్తించారు. అలాగే భారత భద్రతా బలగాలు, మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు కూడా వాటిపై ఉన్నాయి. 
 
ఆ బెలూన్లకు ఉర్దూలో రాసిన ఏదో సందేశం అతికించి ఉండటంతో ఆందోళన చెందిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చా రు.  పోలీసులు అక్కడికి చేరుకొని పసుపుపచ్చ రంగులో ఉన్న బెలూన్లను, వాటికి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. భారత ప్రధాని మోడీని ఉద్దేశించి రాసిన లేఖలు కొన్ని గత సంవత్సరం ఉగ్రదాడి జరిగిన దినానగర్ ప్రాంతంలోని ఘేసాల్ గ్రామం వద్ద కనిపించాయి. వీటిపై ఉర్దూలో, భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఉంది. వీటిపై "మోడీజీ... అయూబీ తల్వార్‌లు ఇంకా మా దగ్గరే ఉన్నాయి. ఇస్లాం వర్థిల్లాలి" అని కూడా ఉంది. కాగా, ఇక్కడికి సమీపంలోని జాండే చాక్ గ్రామంలో పాకిస్థాన్ జెండా ముద్రించి, దానిపై 'ఐ లవ్ పాకిస్థాన్' అని రాసున్న మరో బెలూన్ కూడా దర్శనమిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అపోలోలో ఏం జరుగుతోంది.. 2 రోజులు టైమిస్తున్నా... ఫోటోలు విడుదల చేయకపోయారో?