అపోలోలో ఏం జరుగుతోంది.. 2 రోజులు టైమిస్తున్నా... ఫోటోలు విడుదల చేయకపోయారో?
ఈ రెండు రోజుల అల్టిమేటం జారీ చేసింది ఎవరో కాదు.. ఆ పార్టీ నుంచి బహిష్కృత నేత శశికళ పుష్ప. పార్లమెంట్‌లో అమ్మపై ఆరోపణలు చేసి కంటనీరు పెట్టుకుని.. తిరుచ్చి శివతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు రిలీజ్ కావడంతో అ
ఈ రెండు రోజుల అల్టిమేటం జారీ చేసింది ఎవరో కాదు.. ఆ పార్టీ నుంచి బహిష్కృత నేత శశికళ పుష్ప. పార్లమెంట్‌లో అమ్మపై ఆరోపణలు చేసి కంటనీరు పెట్టుకుని.. తిరుచ్చి శివతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు రిలీజ్ కావడంతో అడ్డంగా బుక్కయిన శశికళ పుష్పను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమ్మ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులు ప్రకటనల ద్వారా చెప్తున్నారే కానీ.. ఆమె ఫోటోలను విడుదల చేయట్లేదు.
దీంతో తమిళనాట గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వీటికి ఫుల్ స్టాఫ్ పెట్టాలంటే అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను రిలీజ్ చేయాలని శశికళ పుష్ప డిమాండ్ చేస్తున్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇంకా అపోలో ఆస్పత్రిలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు.
ఇంకా రెండు రోజుల్లోపు అమ్మ ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన రాకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శశికళ అల్టిమేటం జారీ చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి చెప్పినట్లు అమ్మ ఫోటోలను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.