అమెరికాలోని టెన్నెస్సీలో భారీ వర్షాలకు 21 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో తప్పిపోయారు. టెన్నిస్సీలోని హప్‌రేస్ కౌంటీలో శనివారం వర్షం ముంచెత్తింది. శనివారం ఒకేరోజు 38 సెంటీమీటర్ల (15 ఇంచులు) వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వరదల తాకిడికి స్థానిక రోడ్లు, హైవేలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. సుమారు 21 మంది మరణించారు.
డజన్ల కొద్ది మంది గల్లంతయ్యారని దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మొదట 40 మందికిపైగా తప్పిపోయారని సమాచారం తమకు అందిందని, అయితే వారిలో 20 మంది ఆచూకీ లభించిందని అధికారులు పోలీసులు తెలిపారు.
టెన్నెస్సీ చరిత్రలో ఇంత భారీ వర్షం నమోదవడం, వరదలు సంభవించడం ఇదే మొదటిసారని చెప్పారు. వరదల ధాటికి భారీ సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయని, చాలా ప్రాంతాలు నీట మునిగాయని వెల్లడించారు. తప్పిపోయినవారికో గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు.