Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రకంపనలు సృష్టిస్తున్న చైనా ఏఐ స్టార్టప్ డీప్ సీక్!

Advertiesment
Artificial Intelligence

ఠాగూర్

, గురువారం, 30 జనవరి 2025 (11:43 IST)
చైనాకు చెందిన ఏఏ స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ తాజాగా ప్రకంపనలు సృష్టిస్తుంది. మనం కోరిన సమాచారాన్ని చిటికెలో, అది కూడా ఖచ్చితత్వంతో అందిస్తోంది. తన సామర్థ్యంతో చాట్ జీపీటీ, జెమినీలకు పోటీగా మారింది.
 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ... ఓ చైనా స్టార్టప్ కంపెనీ సవాల్ విసరడం టెక్ దిగ్గజాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్‌ను కుదిపేసిన ఈ చైనా స్టార్టప్ అంతర్జాతీయంగా వేసేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది.
 
చైనాలోని హాంగ్ జౌ నగరానికి చెందిన లియాంగ్ వెన్ ఫెంగ్ డీప్ సీక్ ప్రాజెక్టును 2023లో ఏర్పాటుచేశాడు. చైనాకు చెందిన పలువురు టెక్ గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఏఐ రంగంలో పరిశోధనలకు తెరలేపాడు.
 
ఈ టీమ్‌లో 29 ఏళ్ల లువో పులి ఎంతో కీలకం అని చెప్పాలి. ఆమె ఓ టెక్ రీసెర్చర్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో ఆమె దిట్ట. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను తీసుకున్నా, అందులో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎంతో కీలకం. లువో పులి... 2022లో డీప్ సీక్ టీమ్‌లో చేరాక, ఆ ఏఐ ప్రాజెక్టు శరవేగంగా పరుగులు పెట్టింది. 
 
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఏఐ టెక్‌ను అభివృద్ధి చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ భావిస్తారు. కానీ, డీప్ సీక్ స్టార్టప్ మాత్రం చాలా తక్కువ వనరులతోనూ అద్భుతమైన ఏఐ టూల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం డీప్ సీక్ ఏఐ టూల్ రెండు (R1, R2) మోడళ్లలో అందుబాటులో ఉంది. ఇందులో R1 మోడల్ ఉచితం అని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాషింగ్టన్ విమానాశ్రయంలో పెను ప్రమాదం- రెండు విమానాల ఢీ.. Video Goes Viral