Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగమ్మాయిని ఓడించేందుకు రూ.65 కోట్లు ఖర్చు.. ఎక్కడ?

అమెరికా దిగువ సభకు ఓ తెలుగు అమ్మాయి ఎన్నికకానున్నారు. అదీ కూడా కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన అమ్మాయి. ఈమె వయసు 53 యేళ్లు. వాషింగ్టన్ డీసీలోని మేరీలాండ్ నుంచి అరుణ ప్రతినిధుల సభకు బరిలోగి దిగారు. మంగళ

తెలుగమ్మాయిని ఓడించేందుకు రూ.65 కోట్లు ఖర్చు.. ఎక్కడ?
, మంగళవారం, 26 జూన్ 2018 (08:59 IST)
అమెరికా దిగువ సభకు ఓ తెలుగు అమ్మాయి ఎన్నికకానున్నారు. అదీ కూడా కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన అమ్మాయి. ఈమె వయసు 53 యేళ్లు. వాషింగ్టన్ డీసీలోని మేరీలాండ్ నుంచి అరుణ ప్రతినిధుల సభకు బరిలోగి దిగారు. మంగళవారం జరిగే ప్రాథమిక ఎంపికలో ఆమె గెలుపు ఖాయమని ఆమె మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదిలావుంటే, కృష్ణా జిల్లాలో పుట్టిన ఈ తెలుగమ్మాయి తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు ఓ మెకానికల్ ఇంజనీర్. ఈయనకు ఐబీఎంలో ఉద్యోగం రావడంతో భార్యాపిల్లలను తీసుకుని 1972లోనే అమెరికా వెళ్లి అక్కడే సెటిలైపోయారు. అప్పుడు అరుణ వయసు ఏడేళ్లు. మేరీల్యాండ్‌‌లోని డెమొక్రాట్ల కంచుకోట అయిన ఆరో జిల్లా ప్రైమరీకి ఆమె పోటీలో ఉన్నారు.
 
ఆమె ప్రత్యర్థి డేవిడ్‌ ట్రోన్‌. ఈయనో సంపన్న వ్యాపారవేత్త. తన గెలుపు కోసం ఆయన దాదాపు రూ.65 కోట్లు ఖర్చు చేశారు. అదంతా ఆయన స్వయంగా ఆర్జించిన సొమ్ము. ఈ ఎన్నికల కోసం అరుణ కేవలం రూ.9 కోట్లు ఖర్చుపెట్టారు. ఇదంతా విరాళాల రూపంలో సేకరించినదీ, స్నేహితులు సమకూర్చినది కావడం గమనార్హం. 
 
అరుణ - ట్రోన్‌ల పోటీపై అమెరికా అంతటా విస్తృత చర్చ జరుగుతోంది. ఆమె విజయం దాదాపుగా ఖరారేనని అనేక అమెరికన్‌ పత్రికలు రాస్తున్నా 26న జరిగే ఎన్నికల తర్వాతగానీ తుది ఫలితం వెల్లడికాదు. 1990లోనే మౌంటెగ్మేరీ కౌంటీలో మేరీల్యాండ్‌ వెళ్లిన ఆమె - కాలేజీలో తాను ప్రేమించిన డేవిడ్‌ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. 2004లో డెమొక్రటిక్‌ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. సెర్వింగ్‌ అవర్‌ కమ్యూనిటీస్‌ అనే సంస్థను పెట్టి వివిధ రంగాల్లో వలంటీర్ల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాడు పెట్టే భిక్ష నాకు అవసరం లేదు... వైసీపిలో 'జేసీ' టైపు నేత...