Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

Advertiesment
munir

ఠాగూర్

, బుధవారం, 26 మార్చి 2025 (23:32 IST)
పాకిస్థాన్‌లో తిరుగుబాటు ప్రారంభమైంది. బలమైన ఆర్మీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ పాక్ ఆర్మీ బలం ఇటీవల ఘటనలతో తేలిపోయింది. ముఖ్యంగా బలూచిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడులకు, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబన్ దాడులకు తట్టుకోలేకపోతోంది. మొన్నటికి మొన్న బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ చేసిన బీఎల్ఏ ఏకంగా 200కి పైగా ఆర్మీ, ఐఎస్ఐ ఆఫీసర్లు చంపేసింది. ఆ తర్వాత భద్రతా బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 90 మంది హతమార్చింది. 
 
పాకిస్థాన్ 1971 నాటి పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని ఆర్మీ అధికారులు బంగ్లాదేశ్‌ విభజనను పరోక్షంగా ఉద్దేశిస్తూ లేఖలో పేర్కొన్నారు. మునీర్ వెంటనే రాజీనామా చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించించినట్టు సమాచారం. రాజకీయ అసమ్మతిని అణచివేయడానికి, జర్నలిస్టులపై సైలెంట్ చేయడానికి, ప్రజాస్వామ్య శక్తుల్ని అణచివేయడానికి ఉపయోగించి మునీర్ సైన్యం ప్రతిష్టను దిగజార్చారని లేఖలో ఆరోపించారు. ఒక వేళ రాజీనామా చేయకుంటే సైన్యం స్వయంగా చర్య తీసుకుంటుందని లేఖలో హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్