Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమిపై మనుషులతో పాటు ఏలియన్స్‌ జీవించవుండొచ్చు : హార్వర్డ్ వర్శిటీ అధ్యయనం

aliens

వరుణ్

, శుక్రవారం, 14 జూన్ 2024 (12:46 IST)
భూమిపై గ్రహాంతరవాసులు కూడా జీవించారా? లేదా? అనే అంశంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఓ అధ్యయనం నిర్వహించింది. నిజానికి కొన్ని దశాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతున్న ఏలియన్స్ జాడకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లేదు. దీంతో ఈ విశ్వంలో మనుషులు ఒంటరిగా ఉన్నారా? అనే ప్రశ్నకు ఇంకా నిర్ధిష్టమైన ఆధారం లభించలేదు. అయితే, హార్వర్డ్ యూనివర్శిటీ తాజాగా అధ్యయనంపై భూమిపై మనుషుల మధ్యే గ్రహాంతర వాసులు కూడా జీవిస్తుండవచ్చునని తెలిపారు. రూపం మార్చుకుని మనుషుల మధ్యే రహస్యంగా వచ్చునని అభిప్రాయపడింది.
 
గ్రహాంతర జీవులకు సంబంధించినవిగా భావించే యూఎఫ్‌‌వోలపై (ఎగిరే పళ్లాలు) అధ్యయనం కోసం హార్వర్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన 'హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్'లోని పరిశోధకులు ఈ మేరకు తమ పరిశోధనను ప్రచురించారు. ఏలియన్స్ భూగర్భంలో, చంద్రుడిపై లేదా మనువుల మధ్యే జీవిస్తూ ఉండవచ్చునని అధ్యయనం పేర్కొంది. యూఎఫ్‌వోలు లేదా గుర్తించబడని వైమానిక దృగ్విషయాలు భూమిపై నివసించే గ్రహాంతర వాసుల కోసం వచ్చిన స్నేహితుల అంతరిక్ష నౌకలు కావచ్చుననే కోణంలో కూడా అన్వేషిస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది.
 
భూమికి అవతల జీవాన్ని నిర్ధారించే ఆధారాలు, సిద్ధాంతాల విషయంలో అవగాహన పెరుగుతోందని అధ్యయనం పేర్కొంది. ‘క్రిప్టోటెర్రెస్ట్రియల్' పరికల్పనపై తాము దృష్టి సారించామని, భూమి మీద, భూగర్భంలో, పరిసరాల్లో గ్రహాంతరవాసుల జాడపై అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్ వేదికగా ముష్టిఘాతాలు కురిపించుకున్న ఎంపీలు!!