గురుగ్రామ్, చెన్నైలలో సెటిల్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇది ఈ నాలుగు నగరాల్లో మొత్తం 4000 పడకల సామర్థ్యంతో 60+ కో-లివింగ్ స్పేసెస్‌ను కలిగి ఉంది, ప్రధానంగా వృత్తి నిపుణులను ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో బెడ్‌కు రూ. 12500- రూ. 18,000 ధర పరిధిలో అద్దె వసతిని కంపెనీ అందిస్తుంది.
గృహస్‌ను జెరోధాకు చెందిన నిఖిల్ కామత్, పజ్జోలనా గ్రూప్‌కు చెందిన అభిజీత్ పాయ్ స్థాపించారు. యాంథిల్ వెంచర్స్, ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్, ఆహ్! వెంచర్స్, నీలా స్పేసెస్ లిమిటెడ్, సూనికార్న్ వెంచర్స్, అవఫికసీ క్యాపిటల్, పై వెంచర్స్ LLP, Ekyum కూడా ప్రీ సిరీస్ A రౌండ్‌లో పాల్గొన్నాయి.
కంపెనీ ఈ నిధిని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, టీమ్ విస్తరణ, టెక్నాలజీ కోసం ఉపయోగిస్తుంది. 2020లో స్థాపించబడిన సెటిల్, కో-లివింగ్ స్పేస్‌లు, PGలు, అపార్ట్‌మెంట్‌లను అద్దెకు అందిస్తుంది. ప్రస్తుత రౌండ్‌తో కలిపి కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి రూ.15 కోట్లు సమీకరించింది. మిలీనియల్స్, యువ నిపుణుల కోసం సరసమైన, సౌకర్యవంతమైన గృహ పరిష్కారాలను అందించడం దీని లక్ష్యం.
గృహాస్‌కు చెందిన అభిజీత్ పాయ్ మాట్లాడుతూ, “సెటిల్‌లో పెట్టుబడి పెట్టడం పట్ల గృహాస్ ఆనందంగా వుంది, ఇది ప్రాప్‌టెక్, క్లీన్‌టెక్ వెంచర్‌ల కోసం గృహాస్ ఆస్పైర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ యొక్క మొదటి కోహోర్ట్‌లో మా రెండవ పెట్టుబడిని సూచిస్తుంది" అని అన్నారు. సెటిల్ సహ-వ్యవస్థాపకుడు& డైరెక్టర్ అభిషేక్ త్రిపాఠి మాట్లాడుతూ, "ప్రీమియం కో-లివింగ్ మార్కెట్ భారీ విస్తరణ దశలో ఉంది. సెటిల్, ఈ అవకాశాన్ని త్వరగా, సమర్థవంతంగా ఉపయోగించుకుంది. ఈ కీలకమైన దశలో అటువంటి మార్క్యూ పెట్టుబడిదారులతో చేరడం వృద్ధి, విస్తరణకు సహాయపడుతుంది" అని అన్నారు.