Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ పైశాచికత్వం... భారత జవాన్ల తలలు తెగనరికి.. శరీరం ముక్కలుముక్కలుగా చేసి...

పాక్‌ శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు పైశాచికానందం పొందింది. సరిహద్దుల్లో కవ్వించి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత భూభాగంలోని ప్రవేశించి, ఇద్దరు భారత జవాన్లను కాల్చి చంపింది. అంతటితో ఆగని పాక

పాకిస్థాన్ పైశాచికత్వం... భారత జవాన్ల తలలు తెగనరికి.. శరీరం ముక్కలుముక్కలుగా చేసి...
, మంగళవారం, 2 మే 2017 (09:09 IST)
పాక్‌ శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు పైశాచికానందం పొందింది. సరిహద్దుల్లో కవ్వించి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత భూభాగంలోని ప్రవేశించి, ఇద్దరు భారత జవాన్లను కాల్చి చంపింది. అంతటితో ఆగని పాక్ జవాన్ల బృంద పైశాచికానందం.. అత్యంత కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసింది. ఈ ఘటనపై భారత సైన్యం భగ్గుమంది. సైన్యం నీచమైన చర్యకు తగిన సమాధానం ఇస్తామని ప్రకటించింది. ఈ దారుణం సోమవారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జమ్మూకాశ్మీర్‌ పూంఛ్‌లో నియంత్రణ రేఖ వద్ద సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యంపై కాల్పులకు దిగింది. అప్రమత్తమైన భారత జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఓవైపు కాల్పులు జరుగుతుండగానే మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ) సభ్యులు 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. బీఏటీలో పాక్‌ సైనికులతోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉంటారు.
 
బీఏటీ సభ్యులు భారత భూభాగంలోకి చొరబడిన సమయంలో కృష్ణా ఘాటి సెక్టార్‌లోని బోర్డర్‌ పోస్టుల్లో 22 సిక్కు బెటాలియన్‌కు చెందిన తొమ్మిది మంది బృందం విధులు నిర్వహిస్తోంది. వీరిపై బీఏటీకి చెందిన ముష్కరులు మోర్టార్లతో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో నాయిబ్‌ సుబేదార్‌ పరంజీత సింగ్‌, బీఎస్ఎఫ్ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్‌ వీరమణం పొందగా, వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేసిన బీఏటీ సభ్యులు అనంతరం వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో మరో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ రాజిందర్‌ సింగ్‌ గాయపడ్డారు. 
 
ఈ తాజా ఘటనతో భారత, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గూఢచర్యం ఆరోపణలపై భారతీయుడైన కుల్‌భూషణ్‌ జాదవ్‌కు ఉరిశిక్ష విధించడం.. తాజాగా ఇద్దరు భారత జవాన్లను దారుణంగా హతమార్చడంతో భారత సైన్యం భగ్గుమంటోంది. గత రెండేళ్లుగా పాకిస్థాన్‌ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. నెల రోజుల వ్యవధిలో పూంచ్‌, రాజౌరి సెక్టార్లలో పాక్‌ ఏడుసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో స్నేహితులపై కాల్పులు... బీరు తాగుతూ.. దాచుకున్న తుపాకీతో.. ఒకరి మృతి