ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో స్నేహితులపై కాల్పులు... బీరు తాగుతూ.. దాచుకున్న తుపాకీతో.. ఒకరి మృతి
అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన జరిగింది. అమెరికా శాన్‌డియాగోలో ఏడుగురు నల్లజాతీయులపై జాతి విద్వేష కాల్పులు జరిగాయి. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది.
అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన జరిగింది. అమెరికా శాన్‌డియాగోలో ఏడుగురు నల్లజాతీయులపై జాతి విద్వేష కాల్పులు జరిగాయి. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. స్నేహితుడు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఏడుగురు నల్లజాతీయులపై ఈ కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు మట్టుబెట్టారు. నిందితుడిని పీటర్ సెలీస్‌గా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పీటర్ సెలీస్ (47) కూడా అదే ఆ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం.
పార్టీలో పాల్గొన్న స్నేహితుల్లో ఒక శ్వేతజాతీయుడు... బీరు తాగుతూ, తన వద్ద దాచుకున్న తుపాకీని తీసి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడివారు తమని తాము రక్షించుకోవడానికి ప్రాణభయంతో పరుగులు తీశారు. నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇంతకు ముందే నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.