పవిత్రమైన నర్సు వృత్తిలో ఉన్న ఓ జపాన్ మహిళ గతంలో అతి దారుణంగా ప్రవర్తించింది. తాజాగా
అమెరికాకు చెందిన ఓ నర్సు 10 మందిని చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా ఒరెగాన్ ఆస్పత్రిలో ఓ నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ నింపింది. దీంతో పది మంది రోగులు మృతి చెందారు. ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మందులు చోరీకి గురికావడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
విచారణలో హాస్పిటల్ పేషెంట్స్‌కు ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌ను దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు నర్సు సదరు రోగులకు డ్రిప్ వాటర్‌ని ఇంజెక్ట్ చేసిందని చెప్పింది.
ఆస్పత్రిలో మరణించిన వ్యక్తుల మరణాలు ఇన్ఫెక్షన్ కారణంగానే జరిగిందని ఆస్పత్రి అధికారులు తమతో చెప్పారని మృతుల బంధువులు ఆరోపించారు. సదరు నర్సు నొప్పి మందుకి బదులుగా డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొంది.