ఎగరలేని పావురం.. నడవలేని శునకం మంచిగా దోస్తీ చేస్తున్నాయి. పావురానికి హెర్మన్ అనే పేరుంది. శునకానికి లుండీ అనే పేరు పెట్టారు.. వాటిని పోషించేవారు. వీటి కుటుంబాలు వేర్వేరైనా అవి రెండు స్నేహం చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. నరాల బలహీనతతో ఎగరలేకపోయిన పావురం.. నడవలేని పరిస్థితుల్లో వున్న శునకం స్నేహం చేస్తున్నాయి. న్యూయార్క్, రోచెస్టర్ నగరానికి చెందిన మియా అనే ట్రస్ట్‌లో వుండే ఈ ఇరు జీవులు.. స్నేహభావంతో ఆడుకోవడం.. ఎప్పుడూ కలిసే వుండటం అక్కడ వుండే వారిని ఆశ్చర్య పరిచింది.
వ్యాధుల బారిన పడిన జంతువులను అమెరికా మియా ట్రస్టుకు పంపిస్తుంది. ఇలా మియా సంరక్షణలో వున్న ఈ జీవులు స్నేహభావంతో మెలుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.