ఆల్ఫ్స్ హిమనీనదంలో 75 ఏళ్ల క్రితం స్విస్ కపుల్ మిస్... ఇప్పుడెలా వున్నారో తెలుసా?
ఆ జంట 75 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయింది. 1942లో స్విట్జర్లాండులోని ఓ హిమనీనదం సమీపాన ఆవులకు ఆహారం సమకూర్చేందుకు వెళ్లారు. ఐతే ఇక తిరిగి రాలేదు. దాంతో వాళ్లేమయ్యారన్నది సస్పెన్సుగా మారింది. ఐతే తాజాగా వీరి ఆచూకి తెలిసింది. ఓ రిసార్ట్ కార్మికుడికి ఆ
ఆ జంట 75 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయింది. 1942లో స్విట్జర్లాండులోని ఓ హిమనీనదం సమీపాన ఆవులకు ఆహారం సమకూర్చేందుకు వెళ్లారు. ఐతే ఇక తిరిగి రాలేదు. దాంతో వాళ్లేమయ్యారన్నది సస్పెన్సుగా మారింది. ఐతే తాజాగా వీరి ఆచూకి తెలిసింది. ఓ రిసార్ట్ కార్మికుడికి ఆ ఇద్దరి దేహాలు ఘనీభవించిన స్థితిలో ఆల్ఫ్స్ హిమనీనదంలో కనబడ్డాయి.
ఈ రెండు మృతదేహాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలుపడంతో వాటిని స్వాధీనం చేసుకుని డిఎన్ఎ పరీక్ష చేశారు. రిపోర్టు ప్రకారం వారు తప్పిపోయిన జంటేనని తేలింది. వారు ధరించిన దుస్తులు కూడా 2వ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులుగా గుర్తించారు. కాగా వీరిని ఎవరో చంపేసి హిమనీనదంలో పారవేసినట్లుగా నిర్థారించారు.