ఇండోనేషియా దేశంలో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏడుగురు మరణించగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండోనేషియాలోని సులావేసి దీవుల్లో మజేన్‌కు నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
మాజీనీ దీవుల్లో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపంలో ఒక హోటల్, గవర్నరు కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు సంస్థ అధికారులు చెప్పారు.
భూకంపం తర్వాత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిందని అధికారులు చెప్పారు.ఈ భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం వల్ల వచ్చిన సునామీ వల్ల వేలాదిమంది మరణించారు.