Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

Advertiesment
China Drum Tower

సెల్వి

, గురువారం, 22 మే 2025 (20:00 IST)
China Drum Tower
చైనా, బీజింగ్ నుంచి దాదాపు 320 కిలో మీటర్ల దూరంలో వున్న ఫెంగ్యాంగ్ డ్రమ్ టవర్ ప్రసిద్ధి చెందింది. మింగ్ రాజవంశం స్థాపకుడు యు యువాన్‌జాంగ్ స్వస్థలంగా ఫెంగ్యాంగ్ కౌంటీ ప్రసిద్ధి చెందింది. చైనాలోని శతాబ్దాల నాటి ఫెంగ్యాంగ్ డ్రమ్ టవర్ పాక్షికంగా కూలిపోవడంతో పర్యాటకులు భద్రత కోసం పరుగులు తీయాల్సి వచ్చింది. అన్హుయ్‌లోని 650 ఏళ్ల నాటి డ్రమ్ టవర్ నుండి వందలాది పైకప్పు పలకలు పడిపోయాయి. 
 
టవర్ భాగాలు కూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ప్రాంతాన్ని అన్వేషిస్తున్న సందర్శకుల దగ్గర శిథిలాలు కూలడంతో పర్యాటకులు పరుగులు తీయాల్సి వచ్చింది. 
 
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ నిర్మాణం మొదట 1375లో మింగ్ రాజవంశం కాలంలో నిర్మించబడింది. 1853లో క్వింగ్ రాజవంశం కాలంలో భవనంలోని ఒక భాగం శిథిలమైంది. 1995లో పునర్నిర్మించబడింది. 2023లో, పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ఇది మార్చి 2024లో ముగిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?