Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌లో ప్రత్యేక సందర్భాలను వేడుక చేసుకోవటానికి 6 మరపురాని మార్గాలు

Dubai

ఐవీఆర్

, శుక్రవారం, 30 ఆగస్టు 2024 (23:28 IST)
జీవితంలోని మరుపురాని మైలురాళ్లను అత్యంత అసాధారణమైన మార్గాల్లో వేడుక చేసుకోవడానికి దుబాయ్ వేదికగా నిలిచింది. మీరు ఆనందానుభూతులు అందించే సాహసాలు లేదా మనసును ఉల్లాసపరిచే అందాలు కోరుతున్నా, నగరం అసమానమైన అనుభవాలను అందిస్తుంది.  వీటిలో…
 
1. స్కైడైవ్ దుబాయ్: నగరానికి ఆవల ఉద్విగ్నభరితమైన సాహసం 
దుబాయ్ యొక్క ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్‌లపై స్కైడైవ్‌తో ఉద్విగ్నభరితమైన అనుభవాలను సొంతం చేసుకోండి. పామ్ జుమేరా, మిరుమిట్లు గొలిపే స్కైలైన్ పైన ఎగురండి. పుట్టినరోజుల వంటి ప్రత్యేక సందర్భాలలో, స్కైడైవ్ దుబాయ్ వీడియో, స్మారక కప్పు మీ జంప్ యొక్క ముద్రిత ఫోటోతో కూడిన ప్యాకేజీలను అందిస్తుంది, మీ వేడుకను మరచిపోలేనిదిగా నిర్ధారిస్తుంది.
 
2. ప్రైవేట్ ఎడారి సఫారి: విలాసవంతమైన ఎడారి అద్భుతం 
ప్రైవేట్ ఎడారి సఫారీతో మీ ప్రత్యేక సందర్భాన్ని మరింత ఆనందంగా మార్చుకోండి. రుచికరమైన భోజనం, ప్రైవేట్ ఒయాసిస్‌లో ప్రత్యేకమైన బసతో మీ సాహసయాత్రను మలుచుకోండి.
 
3. అద్వితీయ రుచులు, సాంస్కృతిక విందులు 
దుబాయ్, అంతర్జాతీయ రుచుల కేంద్రంగా నిలుస్తుంది. విఖ్యాత చెఫ్‌లు అందించే రుచులతో పాటుగా దుబాయ్ కళ, విందు యొక్క విలక్షణమైన సమ్మేళనాన్ని కూడా అందిస్తుంది. విభిన్న రుచులను కోరుకునే వారికి వివిధ రకాల అంతర్జాతీయ వంటకాలను ప్రదర్శిస్తాయి. 
 
4. లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ వైభవం: 
ఒపెరా, థియేటర్ నుండి లైవ్ మ్యూజిక్ వరకు అత్యుత్తమ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో దుబాయ్ వెలిగిపోతున్నప్పుడు-అల్ హబ్టూర్ సిటీలోని లా పెర్లేలో అసమానమైన ఆక్రోబాటిక్ దృశ్యం నిజంగా అసాధారణమైనది. VIP ప్యాకేజీలో ప్రత్యేకమైన ప్రీ-షో యాక్సెస్‌తో కూడిన సొగసైన లాంజ్‌ వద్ద అత్యుత్తమ సీట్లు మీకోసం ఎదురుచూస్తున్నాయి.
 
5. స్పా డే 
దుబాయ్‌లోని ప్రఖ్యాత వెల్‌నెస్ సెంటర్‌లలో విలాసవంతమైన స్పా డేతో మిమ్మల్ని మీరు సంతోషంతో నింపుకోండి. సాంప్రదాయ హమామ్‌ల నుండి ఆధునిక స్పా ట్రీట్‌మెంట్‌ల వరకు, దుబాయ్‌లోని మొదటి వెల్‌బీయింగ్ రిసార్ట్ అయిన ది రిట్రీట్‌లో సంతోషాన్ని పరిగణించండి. 
 
6. హట్టాలో హైకింగ్: సాహసం- ప్రకృతిని ఆలింగనం చేసుకోండి
బహిరంగ సాహసాలను ఆస్వాదించే వారి కోసం, హట్టా కయాకింగ్, మౌంటెన్ బైకింగ్, గుర్రపు స్వారీ వంటి కార్యకలాపాలను కూడా అందిస్తుంది, దానితో పాటు సౌకర్యవంతమైన వసతి సౌకర్యాలను కూడా అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛానెల్ ఆఫరింగ్స్‌ను విస్తరించిన సామ్‌సంగ్ టివి ప్లస్, ఏంటవి?