Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత... 22 మంది మృత్యువాత

Advertiesment
gunman
, గురువారం, 26 అక్టోబరు 2023 (08:57 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. ఓ దండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది చనిపోయారు. ఈ దారుణం మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి జరిగింది. ఓ బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
సెమీ ఆటోమేటిక్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల మేరకు.. ఈ ఘటనలో 22 మంది చనిపోగా, మరో 60 మంది గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాల్పులు జరిపిన ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు, ఈ దారుణ ఘటనపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ట్విట్టర్ వేదికగా తన విచారం వ్యక్తం చేస్తూ, తాను తీవ్రమైన భయభ్రాంతులకు గురైనట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్లాదిమిర్ పుతిన్‌కు గుండెపోటా? రష్యా క్లారిటీ ఇచ్చిందా?