ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయారు. తాలిబన్ నాయకులు, తాలిబన్ మద్దతు మతగురువు లక్ష్యంగా మసీదులో భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో భాగంగా, ప్రార్థనలు చేస్తున్న సయమంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుస్తోంది.
తాలిబాన్ ముఖ్యనేత, అఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రధాని ముల్లా బరాదర్ టార్గెట్‌గా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తాలిబాన్ నాయకులతో సంబంధాలు ఉన్న.. ప్రముఖ మత గురువు ముజీబ్ ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు. అయితే ముల్లా బారాదర్ గురించి వివరాలు వెల్లడించడం లేదు తాలిబాన్ వర్గాలు. అయితే ఈ దాడికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ చేసినట్లు తెలుస్తోంది.