పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కలాకతాయ్-నరాంగ్ మండీ రోడ్డు మార్గంలో బస్సు, వ్యాను ఢీ కొన్నాయి. దీంతో వ్యానులోని సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. నరాంగ్ మండీకి 75 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సయాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ విచారం వ్యక్తం చేశారు.
సిలిండర్ పేలడంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. రెస్క్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు ఓ అధికారి చెప్పారు. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించగా, గాయపడిన 17మందిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.