వాయువ్య చైనాలోని ఓ అపార్టుమెంటులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది మంది సజీవదహనమయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వాయువ్య చైనాలోని షింజియాంగ్ నగరంలోని ఓ బహుళ అంతస్తు భవనంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.
అలాగే, సోమవారం మధ్య చైనాలోని ఓ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడ కూడా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇటీవలి కాలంలో చైనాలోని కర్మాగారాల్లో వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత 2015లో టింజన్‌లోని రసాయనాల గోదాముల్లో జరిగిన వరుస పేలుళ్ళలో 175 మంది చనిపోయిన విషయం తెల్సిందే. గత అక్టోబరు నెలలో షెన్‌యాంగ్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు.