ఇల్లు పరిమళభరితంగా ఉండాలంటే..!!
Publish Date: Tue, 10 Apr 2012 (16:35 IST)
Updated Date: Tue, 10 Apr 2012 (16:35 IST)
ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు వంట చేసిన తర్వాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలు కాకుండా సుగంధ నూనెలతో పరిష్కరించుకోవచ్చు.* అరబకెటు నీటిలో పావుకప్పు వెనిగర్, చెంచా నిమ్మనూనె కలిపితే గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణం నింపుతుంది.* కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే, కప్పు బేకింగ్ సోడాకి చెంచాడు ఏదైనా సుగంధ నూనెలని కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట కార్కెట్‌పై చల్లి ఉదయాన్నె వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.* కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనీగర్‌కి, చెంచా లావెండర్ పరిమళాన్ని జోడించి తుడిస్తే అవి తళుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి.* వంట చేసిన తర్వాత గదంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని దానిలో దాల్చినచెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది.* దుస్తులు ఒక్కచోట పోగుపడి, ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరేయాలి. వీలుకానప్పుడు యూకలిప్టస్, నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.