వర్షాకాలంలో దోమలను తరిమికొట్టాలంటే.. వేపనూనెను వాడాలి. ఒక టీస్పూన్ వేపనూనెను 30 మిల్లీ లీటర్ల కొబ్బరినూనెలో కలిపి శరీరమంతా అప్లై చేయాలి. అలాగే, దాల్చిన చెక్కతో చేసిన నూనె దోమలను దూరం చేస్తుంది. దోమల వల్ల కలిగే దద్దుర్లను తగ్గిస్తుంది.
అదే విధంగా లావెండర్ వాసన దోమలను ఇంట్లోకి రాకుండా మంచి అరోమాను అందిస్తుంది. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, ఐదు చుక్కల వెనీలా ఎసెన్స్, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో తీసుకుని చేతులు, కాళ్లకు బాగా స్ప్రే చేయాలి. ఇలా చేస్తే దోమలు కుట్టకుండా ఉంటాయి.
లెమన్‌గ్రాస్‌లో సిట్రోనెల్లా అనే సహజ నూనె ఉంటుంది. ఇది దోమలను దూరంగా ఉంచే సహజ పదార్ధంగా ఉపయోగపడుతుంది. లెమన్‌గ్రాస్‌లోని సిట్రోనెల్లా 2.5 గంటల వ్యవధిలో దోమలను తరిమికొట్టగల బలమైన వాసనను కలిగి ఉందని. ఇది దోమలను నియంత్రించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యయనాలు తేల్చాయి.