భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలలో అనారోగ్యాలను దూరం చేసే గుణాలు పుష్కలంగా వున్నాయి. సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఒకటి. మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫ్లాట్యులెన్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.
మిరియాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మిరియాలను పసుపులో కలిపి తీసుకుంటే, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. పసుపు, మిరియాలు కలిపి పాలలో తాగడం వల్ల సాధారణంగా తీవ్రమైన జలుబు నయమవుతుంది.
రోజూ ఆహారంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తింటే అజీర్ణ సమస్యలు దరిచేరవు. ఆహారాలలో చిటికెడు నల్ల మిరియాలు జోడించడం చాలా మంచిది. దీనివల్ల జీర్ణశయాంతర వ్యాధులను నివారిస్తుంది.