Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏసీలు కొనుగోలు చేస్తున్నారా? అయితే, కొనేముందు ఇవి తెలుసుకోండి?

శివరాత్రితో చలికాలం శివశివ అంటూ వెళ్లిపోతుందన్నది పెద్దల మాట. వాస్తవానికి ఈ యేడాది శివరాత్రి పోకమునుపే పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అనంతపురంతో పాటు తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు

ఏసీలు కొనుగోలు చేస్తున్నారా? అయితే, కొనేముందు ఇవి తెలుసుకోండి?
, బుధవారం, 1 మార్చి 2017 (11:34 IST)
శివరాత్రితో చలికాలం శివశివ అంటూ వెళ్లిపోతుందన్నది పెద్దల మాట. వాస్తవానికి ఈ యేడాది శివరాత్రి పోకమునుపే పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అనంతపురంతో పాటు తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే, వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలను అత్యధికంగా వినియోగిస్తుంటారు. దీంతో వేసవి కాలంలో ఏసీల వాడకంతో పాటు.. విక్రయాలు జోరుగా సాగుతాయి. అయితే, ఏసీలు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను విధిగా తెలుసుకోవాలి. అవేంటంటే... 
 
ఏసీ ఏర్పాటు చేయాలనుకుంటున్న గది లేదా హాలు పరిమాణాన్ని బట్టి ఎంత సామర్థ్యం అవసరమనేది ఎంచుకోవాలి. అవసరానికన్నా తక్కువ సామర్థ్యముంటే సరైన చల్లదనం అందదు. అవసరానికి మించినది తీసుకుంటే.. సొమ్ము వృథాతోపాటు విద్యుత్ బిల్లులు మోత మోగిపోతాయి.
 
వీలైనంత వరకూ ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీని కొనుగోలు చేయడమే మేలు. వినియోగం చాలా తక్కువగా ఉంటే మాత్రం కొంత తక్కువ స్టార్ రేటింగ్ ఉన్నా ఫరవాలేదు. ఎందుకంటే ఎక్కువ రేటింగ్ ఉండే ఏసీల ధరలు చాలా ఎక్కువ. అయితే ఎలా చూసినా కనీసం 3 స్టార్ ఆపైన రేటింగ్ ఉన్నవి తీసుకోవడం మేలు.
 
ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీలు ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ తరహా ఏసీల వాడకం వల్ల 50 శాతం మేరకు విద్యుత్ ఆదా అవుతుంది. పలు ఏసీల్లో ఆటో క్లీన్ మోడ్ ఉంటుంది. దానివల్ల తరచూ శుభ్రం చేయాల్సిన పని తప్పుతుంది. ఇలాంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం. 
 
ఏసీ కాయిల్స్ తుప్పు పట్టకుండా (కొరిజన్ ప్రొటెక్షన్) కోటింగ్ రక్షణ ఉందో లేదో గమనించాలి. బ్లూఫిన్ కండెన్సర్ లేదా మైక్రో చానల్ కండెన్సర్ అయితే మేలు. కొన్ని కంపెనీలు తయారు చేసే ఏసీల్లో అదనంగా వాటర్ కూల్డ్ కండెన్సర్‌ను అందిస్తున్నాయి. మిగతావాటితో పోల్చితే ఈ ఏసీలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలోనూ మెరుగైన చల్లదనాన్ని అందిస్తాయి. అయితే నీటిని వినియోగించాల్సి వస్తుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లల ముందు వాగ్వివాదానికి దిగొద్దు.. కుంగుబాటు తప్పదు బీ కేర్ ఫుల్..