కావలసిన పదార్థాలు :
సొరకాయ... చిన్నసైజుది ఒకటి
కందిపప్పు... రెండు కప్పులు,
పచ్చికొబ్బరి... ఒక చిప్ప
మిరియాలు... పది
దనియాలు... 4 టీ.
ఎండు మిరపకాయలు... మూడు
మినప్పప్పు... ఒక టీ.
కరివేపాకు... రెండు రెమ్మలు
జీలకర్ర... పావు టీ.
నూనె... రెండు టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
సొరకాయ తొక్కు తీసి మీడియం సైజులో ముక్కలు కోయాలి. కుక్కర్లో కందిపప్పు, సొరకాయ ముక్కలు, మూడు గ్లాసుల నీరు పోసి ఉడికించాలి. తరవాత కొబ్బరి, ధనియాలు, మిరియాలు కలిపి పేస్టులా రుబ్బాలి. ఇప్పుడు ఈ పేస్టును కందిపప్పు ఉడికించిన కుక్కర్లో వేయాలి.
ఉప్పు, పచ్చి కరివేపాకును కూడా కుక్కర్లో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. చివరగా దీన్ని తాలింపు పెడితే సొరకాయ కూటు సిద్ధం. ఇది రొట్టెల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది.