Article Indian Cookery %e0%b0%b8%e0%b1%87%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b0%be %e0%b0%95%e0%b1%8a%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b0%b0%e0%b0%bf %e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82 109053000053_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సేమ్యా కొబ్బరి అన్నం

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
సేమ్యా... వంద గ్రా.
వేయించిన వేరుశెనగపప్పు... రెండు టీ.
ఉప్పు... సరిపడా
నిమ్మకాయ... ఒకటి
నూనె... వంద గ్రా.
పోపుగింజలు... కాసిన్ని
కొబ్బరిచిప్ప... ఒకటి
కొత్తిమీర... రెండు టీ.
జీడిపప్పు... కొద్దిగా

తయారీ విధానం :
కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోవాలి. సేమ్యాలో ఉప్పు వేసి ఉడికించాలి. దాంట్లోనే కొద్దిగా నూనె కలిపి ఓ గిన్నలోకి తీసుకుని దానిమీద మళ్లీ చల్లటి నీళ్ళుపోసి వార్చాలి. ఇలా చేసినట్లయితే సేమ్యా పొడిపొడిగా ఉంటుంది.

ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక... పోపుగింజలు, కొబ్బరి తురుమును వేసి 5 నిమిషాలు వేయించి, తర్వాత సేమ్యాని వేసి మరో ఐదు నిమిషాలు వేయించి.. చివర్లో నిమ్మరసం, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు, వేరుశెనగపప్పులను పైన చల్లి సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu