Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెజ్‌ నూడుల్స్ మసాలా

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
నూడుల్స్‌... అర కిలో
క్యాబేజీ తురుము... రెండు కప్పులు
క్యారెట్‌ ముక్కలు... రెండు కప్పులు
ఉల్లికాడ తురుము... రెండు కప్పులు
పచ్చిమిర్చి... నాలుగు
ఉప్పు... తగినంత
గరంమసాలా పొడి... రెండు టీ.
మంచినీళ్లు... ఒక లీ.

తయారీ విధానం :
క్యారెట్‌లను చక్రాల్లా కోసుకోవాలి. బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. అందులో క్యారెట్‌ ముక్కలు, క్యాబేజీ తురుము వేసి సగం ఉడికిన తరవాత నూడుల్స్‌ వేయాలి. నూడుల్స్‌ కూడా ఉడికిన తరవాత సన్నగా చీలికలుగా కోసిన పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లికాడ తురుము, మసాలాపొడి వేసి నీళ్లంతా ఇగిరిపోయేలా చేసి దించాలి. అంతే వేడి వేడి వెజ్‌ నూడుల్స్ మసాలా తయారయినట్లే... వీటిని అలాగే గానీ లేదా గ్రీన్‌ సలాడ్‌తోగానీ కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరూ ట్రై చేయండి.

Share this Story:

Follow Webdunia telugu