Article Indian Cookery %e0%b0%b5%e0%b0%82%e0%b0%95%e0%b0%be%e0%b0%af %e0%b0%95%e0%b1%82%e0%b0%9f%e0%b1%81 108081200061_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంకాయ కూటు

Advertiesment
వంటకాలు భారతీయ లేత వంకాయలు పచ్చిమిరప చింతపండు ఉప్పు కందిపప్పు ఆవాలు మినప్పప్పు
FileFILE
కావలసిన పదార్థాలు :
లేత వంకాయలు... 350 గ్రాములు
పచ్చిమిరప... 6 కాయలు
చింతపండు... తగినంత
ఉప్పు... ఒకటింపావు స్పూను
కందిపప్పు... 75 గ్రాములు
ఆవాలు... 1 టీ స్పూను
మినపప్పు... ఒకటిన్నర స్పూను
ఎండుమిరపకాయలు... 2
ఇంగువ, కరివేపాకు, పసుపు.... పోపుకు
నూనె... 2 లేదా 3 స్పూనులు

తయారీ విధానం :
వంకాయలన్నీ సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను రెండుగా చేసుకోవాలి. కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల నూనెలో వంకాయలు, పచ్చిమిరప వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి చింతపండు రసం, ఉప్పు, పసుపు ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి.

కూర బాగా పలుచగా ఉన్నట్లు అనిపిస్తే... అర టీస్పూను బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు. లేకపోతే అలానే ఉంచేయవచ్చు. తరువాత దీనికి ఇంగువ నీరు కూడా కలుపుకోవాలి. చివరగా ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu